Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!
కూరగాయల ధరల మంటకు సామాన్యుడు విలవిలలాడుతున్నాడు.
- By Hashtag U Published Date - 08:00 PM, Tue - 17 May 22

కూరగాయల ధరల మంటకు సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. హైదరాబాద్, విజయవాడలో కిలో టమాటా ధర రూ.70 దాటగా, కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.80కి చేరింది. రెండు నెలల క్రితం ఈ నగరాల్లో కేజీ టమాటా 10 నుంచి 20 రూపాయలు మాత్రమే. ఇంకొన్ని రోజుల్లో ధర వందకు చేరినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ఏ కూర వండినా అందులో టమాటా ఉండాల్సిందే. అలాంటి టమాటా ఇప్పుడు కొనాలంటేనే కరువైపోయింది. తుఫాన్ కారణంగా టమాట పంట కు బాగా నష్టం వాటిల్లింది. ఫలితంగా ఈసారి దిగుబడి తగ్గింది. ఈ కారణంగా టమాట రేట్లు రెక్కలు తొడిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధానమైన కర్నూలు, చిత్తూరు, మదనపల్లి మార్కెట్లోనూ టమాటా ధర భారీగా పెరిగిపోయింది. టమాటా మాత్రమే కాదు.. క్యాప్సికమ్, చిక్కుడు లాంటి కూరగాయలు కూడా కేజీ రూ.80 దగ్గర ఉన్నాయి
Related News

Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.