HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tollywood Star Pawan Kalyan Shares An Emotional Post On Chiranjeevi Birthday

Pawan Wishes To Chiru: మనసున్న మారాజు మా అన్నయ్య!

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన జన్మదినం పురస్కరించుకొని టాలీవుడ్ నటులు

  • Author : Balu J Date : 22-08-2022 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan And Chiru
Pawan And Chiru

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన జన్మదినం పురస్కరించుకొని టాలీవుడ్ నటులు, ప్రముఖులు, రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తన అన్న చిరంజీవి బర్త్ డే సందర్భంగా, తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమోషన్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘‘అన్నయ్య…. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవి గారిని పిలవడమే కారణమేమో. ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు. శ్రీ చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు ఏం చెప్పాలంటే ఒకింత కష్టమే. ఎందుకంటే – ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన ఇంతవాడు అంతవాడైన విషయం చెప్పాలా… ఆయన సాధించిన విజయాలు గురించి చెప్పాలా… ఆయన సినిమాల్లో సాధించిన రికార్డుల గురించి చెప్పాలా.. ఆయన అధిరోహించిన పదవుల గురించి చెప్పాలా… ఆయన కీర్తిప్రతిష్ఠల గురించి చెప్పాలా… ఆయన సేవాతత్పరత గురించి చెప్పాలా…. ఇవన్నీ తెలుగు వారందరితోపాటు యావత్ భారత దేశమంతటికీ సర్వ విదితమే. అయితే అన్నయ్యలోని గొప్ప మానవతావాది గురించి చెప్పడమే నాకు ఇష్టం.

దోసిట సంపాదిస్తే గుప్పెడు దానం చేయాలనే ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చమటను ధారగా పోసి సంపాదించిన సొమ్ము నుంచి ఎందరికో సహాయం చేశారు. పేదరికంతో బాధపడుతున్నా… అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా లేదా చదువులకు దూరమైన వారి గురించి ఎవరి ద్వారా తెలిసినా తక్షణం స్పందించి సాయం చేసే సహృదయుడు అన్నయ్య. కోవిడ్ సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో అలమటించకుండా ఆయన చూపిన దాతృత్వం… బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందితో ఏర్పరచుకున్న రక్త సంబంధం…. వేలాది గుప్త దానాలు… ఇలా ఒకటి రెండు కాదు. ఇటీవల ప్రకటించిన ఉచిత ఆసుపత్రి స్థాపన వరకూ చేస్తున్న కార్యక్రమాలు ఆయనలోని మానవతామూర్తిని తెలియచేస్తాయి.

అన్నిటికన్నా మిన్న ఆయనలోని ఒదిగి ఉండే లక్షణం. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం శ్రీ చిరంజీవి గారి సొంతం. వయసు తారతమ్యాలు… వర్గ వైరుధ్యాలు… కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకొనే విశాల హృదయుడు అన్నయ్య చిరంజీవి గారు. అటువంటి సుగుణాలున్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావడం నా పూర్వ జన్మ సుకృతం. ఈ శుభ దినం సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… నాకు తల్లిలాంటి మా వదినమ్మ సహచర్యంలో ఆయన నిండు నూరేళ్ళు చిరాయువుగా వర్థిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రూపంలో ఉన్న నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను’’ అంటూ పవన్ ఎమోషన్ అయ్యాడు.

Just forwarding a B’day message from an intellectual who works for Rural India :
Chiranjeevi garu has been an emotion for me he remains a forever inspiration.His film ‘RudraVeena’was a major influence on me & made me study & work for villages of India.

— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday wishes
  • emotional post
  • megastar chiranjeevi
  • Pawan Kalyan

Related News

Pawan Kalyan Gift To Bcrick

Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

Blind Cricketers : క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వీరిని ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్, వారి అవసరాలను గుర్తించి పెద్ద మనసుతో సహాయం అందించారు

  • Dekhlenge Saala Lyrical Vid

    Dekhlenge Saala Song: చాల ఏళ్ల తర్వాత పవన్ నుండి ఎనర్జిటిక్ స్టెప్పులు

  • Pawan Kalyan

    Pawan Kalyan : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ పిటిషన్

  • Ap Cabinet Meeting Dec 11

    AP Cabinet Decisions : ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు

  • Chandrababu

    CBN : ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం – సీఎం చంద్రబాబు

Latest News

  • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

  • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

  • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

  • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

Trending News

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd