HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >The Line Is Clear For Janasena Varahi

Janasena Varahi : ‘వారాహి’ కి లైన్ క్లియర్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) వాహనానికి లైన్ క్లియర్ అయింది.

  • Author : Maheswara Rao Nadella Date : 12-12-2022 - 5:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Varahi Janasena
Varahi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) వాహనానికి లైన్ క్లియర్ అయింది. పవన్ వాహనానికి (Pawan Kalyan Varahi) అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు (Telangana RTA Officials) స్పష్టం చేశారు. పవన్‌ ‘వారాహి’ వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా కేటాయించారు. ‘వారాహి’ రిజిస్ట్రేషన్ నెంబర్ (Varahi Registration Number) TS 13 EX 8384 అని అధికారులు పేర్కొన్నారు. ‘వారాహి’ కలర్‌ ఆలివ్ గ్రీన్‌‌ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనంగా చెబుతున్న ‘వారాహి’ వాహనం రంగు ‘ఆర్మీ’ వాహనాల రంగును పోలి ఉండటంతో ఈ వాహనం గురించి పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.

కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం.. చాప్టర్ 121లో ఒక విషయం స్పష్టంగా ఉంది. డిఫెన్స్ శాఖకు చెందిన వాహనాలకు తప్ప అగ్రికల్చర్ ట్రాక్టర్లతో పాటు ఇతర ఏ వాహనాలకూ ఆలివ్ గ్రీన్ కలర్ పెయింటింగ్‌గా వేయకూడదని ఆ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం పవన్ ప్రచార రథమైన ‘వారాహి’కి ఎమరాల్డ్ గ్రీన్ పెయింటింగ్ వేయడంతో ఈ వివాదానికి దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్టే.. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) డిసెంబర్ 7న ఒక వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. తన పర్యటనల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనం వారాహి వీడియోను విడుదల చేశారు. ఈ వాహనాన్ని బుధవారం హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌కు ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ ఆయన చర్చించారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఈ వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు.

వారాహి ప్రత్యేకతలు:

ఇటీవల కాలంలో పవన్‌ సభలు, రోడ్‌ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా… చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు. ఇక, వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్‌ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్‌ ప్రత్యేక సర్వర్‌కు రియల్‌ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇక, వాహనం లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు, వాహనం లోపలి నుంచి పైకి వెళ్లడానికి హైడ్రాలిక్‌ మెట్లు ఉంటాయి.

Also Read:  Hormone : బెల్లీ ఫ్యాట్‌ పెరుగుతుందంటే ఈ హార్మోన్‌ ఎక్కువగా ఉన్నట్లే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Janasena
  • Official
  • Pawan Kalyan
  • politics
  • RTA Office
  • Speed News
  • telangana
  • Varahi

Related News

Telangana Liquor Prices hike

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె

  • Richest Ministers

    టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

  • Telangana Cabinet

    త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

  • Ambati Rambabu

    Ambati Rambabu: అమరావతిపై అంబటి విషం..

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

Latest News

  • Iran Conditions : అమెరికాకు ఇరాన్ పెట్టిన షరతులు ఇవే..!!

  • Peddi : జూన్ లో ‘పెద్ది’ ఇది ఫిక్స్ ?

  • Weight : ఎప్పుడూ ఒకేలా మీ బరువు ఉండాలంటే మీరు ఇలా చేయాల్సిందే !!

  • Vaaranasi : ఇది మన టైం అంటూ మహేష్ అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి

  • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd