HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Belly Fat Increases When This Hormone Is High

Hormone : బెల్లీ ఫ్యాట్‌ పెరుగుతుందంటే ఈ హార్మోన్‌ ఎక్కువగా ఉన్నట్లే..!

అడ్డ్రినల్‌ గ్రంథులు కార్టిసోల్‌ (Cortisol) హార్మోన్‌ (Hormone)ను ఉత్పత్తి చేస్తాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 12-12-2022 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cortisol Hormone
Cortisol Hormone

అడ్డ్రినల్‌ గ్రంథులు కార్టిసోల్‌ (Cortisol) హార్మోన్‌ (Hormone)ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా రిలీజ్‌ అవుతుంది. కార్టిసోల్ (Cortisol) మన శరీరంలో కొవ్వును, ప్రొటిన్‌, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ (Hormone) ఎక్కువ మొత్తంలో రిలీజ్‌ అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల హార్మోన్లు అవసరం.

హార్మోన్లు కూడా కెమికల్స్‌ లాంటివే ఇవి మన రక్తప్రవాహం ద్వారా అవయవాలు, చర్మం, కండరాలు ఇతర కణజాలాలకు సందేశాలు తీసుకెళ్తాయి. ఇవి మన శరీరంలో జరిగే అనేక విధులను సమన్వయం చేస్తాయి. ఈ సంకేతాలు మీ శరీరానికి ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో తెలియజేస్తాయి. ఈ హార్మోన్లలో కార్టిసోల్ కూడా ఒకటి. అడ్డ్రినల్‌ గ్రంథులు కార్టిసోల్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా రిలీజ్‌ అవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రొటిన్‌, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. హైపర్‌ టెన్షన్‌, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తుంది. మన నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది.

అయినప్పటికీ, ఏదైనా హార్మోన్ ఎక్కువ మొత్తంలో రిలీజ్‌ అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం. మన శరీరంలో కార్టిసోల్‌ స్థాయిలు పెరిగితే ఏమి జరుగుతుందని పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా వివరించారు. దీర్ఘకాలం పాటు మన శరీరంలో కార్టిసోల్‌ పెరుగుతూ ఉంటే.. మన ఆరోగ్యానికి మేలు బదులు ఎంతో నష్టం చేస్తుందని లవ్‌నీత్‌ బాత్రా అన్నారు.

కార్టిసోల్ (Cortisol):

 

View this post on Instagram

 

A post shared by Nutrition.by.Lovneet (@nutrition.by.lovneet)

ఈ సమస్యలు వస్తాయి:

బాగా ఒత్తిడికి గురైనా, కోపం వచ్చినా మన శరీరంలో కార్టిసోల్‌ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మన శరీరం మరింత ఉత్తేజితమై, వాటి ప్రభావం కండరాలమీద పడుతుంది. ఫలితంగా..

  • హైపర్‌టెన్షన్‌ పెరుగుతుంది.
  • బెల్లీ ఫ్యాట్‌, ఫేస్‌ ఫ్యాట్‌ పెరుగుతుంది.
  • కండరాల బలహీనత
  • మూడ్ స్వింగ్స్‌
  • ఎముకల వీక్‌ గా అవ్వడం
  • జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.

ఎలా తగ్గించుకోవాలి?

  • ప్రశాంతంగా నిద్రపోండి
  • రెగ్యులర్‌గా వ్యాయామం చేయండి
  • ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోండి
  • ధ్యానం, ప్రాణాయామం చేయండి
  • మీకు ఇష్టమైన పనులు చేయండి(మ్యూజిక్‌ వినడం, బుక్‌ చదవండం, గార్డెనింగ్‌ లాంటివి)

ఎంత ఉండాలి?

ఉదయం 6 నుంచి 8 గంటల వరకు: డెసి లీటర్‌కు 10 నుంచి 20 మైక్రో గ్రాములు (mcg/dL) ఉండాలి.

సాయంత్రం 4 గంటల సమయంలో:  డెసి లీటర్‌కు 3 నుంచి 10 మైక్రో గ్రాములు (mcg/dL) ఉండాలి.

కార్టిసాల్ పెరిగిందని ఎలా తెలుస్తుంది?

క్లీవ్‌ల్యాండ్‌క్లినిక్ ప్రకారం, శరీరంలో కార్టిసాల్ స్థాయిని మూత్రం, కఫం ద్వారా గుర్తించవచ్చు. దీనిని గుర్తించడానికి డాక్టర్‌ టెస్ట్‌లు చేస్తారు.

ఈ ఆహారం తీసుకోండి:

Are Sunflower Seeds Nuts | Benefits of Sunflower Seeds • India Gardening

గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, తాజా ఆకుకూరలు, జీడిపప్పు వంటివాటిలో ఉండే మెగ్నీషియం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీలు, నారింజ, జామ పండ్లు మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్లను సమన్వయం చేసి ఒత్తిడి తగ్గిస్తాయి. గుడ్లు, చేప, చికెన్‌, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చిక్కుడు గింజలు వంటివి మెదడును చురుగ్గా ఉంచుతాయి. సెరొటోనిన్‌ స్థాయులను పెంచి ఆందోళనకు కారణమయ్యే కార్టిసోల్‌ హార్మోన్‌ను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.

Also Read:  Hair Fall Solutions: మీ జుట్టు సమస్యకు పరిష్కారం మీ చేతిలో..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • belly fat
  • Cortisol
  • health
  • hormone
  • hormones
  • Imbalance
  • Life Style

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

  • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd