TDP vs YCP : దెందులూరులో ఉద్రిక్తత.. చింతమనేని అనుచరుడిపై వైసీపీ నేతల దాడి
దెందులూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుడిపై
- By Prasad Published Date - 11:02 AM, Mon - 5 December 22

దెందులూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుడిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. నియోజకవర్గంలో మట్టి అక్రమ త్రవ్వకాలపై ప్రశ్నించిన టీడీపీ నాయకులపై అర్ధరాత్రి ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు.ఈ ఘటన దెందులూరు నియోజకవర్గం కొప్పాక – చినబోయిన పల్లి సమీపంలో జరిగింది. ఈ ఘటనలో చింతమనేని ప్రధాన అనుచరుడు శివబాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.రక్తం ఓడుతున్న శివాబాబుతో సహా 4గురు బాధితులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి టీడీపీ కార్యకర్తలు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని సతీమణి రాధమ్మ అసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. టీడీపీ నేతలపై దాడితో దెందులూరు పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఇరువర్గాలు మళ్లీ దాడులకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో దెందులూరులో పోలీసులు భారీగా మోహరించారు.