Corona : తెలంగాణ ప్రభుత్వం కరోనా కొత్త వేరియంట్ పై అలర్ట్..
కొత్త వేరియంట్ రూపంలో కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండడంతో తెలంగాణ (Telangana) ప్రభుత్వం అలర్ట్.
- By Maheswara Rao Nadella Published Date - 12:28 PM, Thu - 22 December 22

కొత్త వేరియంట్ (New Variant) రూపంలో కరోనా (Corona) వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండడంతో తెలంగాణ (Telangana) ప్రభుత్వం అలర్ట్ . వైరస్ వ్యాప్తిని ప్రారంభంలోనే గుర్తించి, అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల స్క్రీనింగ్ తో పాటు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని నిర్ణయించింది. కరోనా (Corona) కొత్త వేరియంట్ చైనా, అమెరికా, జపాన్, దక్షిణకొరియా దేశాలను భయపెడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో మాస్క్ వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు కరోనా సోకకుండా జనం జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. డిసెంబర్ 21న తెలంగాణలో నమోదైన కేసులు కేవలం ఆరు మాత్రమే. ప్రస్తుతం రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 34 మాత్రమేనని ఆరోగ్య శాఖ ప్రకటించింది. బీఎఫ్ 7 వేరియంట్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్నట్లు వివరించారు.
Also Read: New Covid Variant: చైనాను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, ఇన్ఫెక్షన్ లక్షణాలపై పూర్తి వివరాలివే