Telangana : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాయకులు
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తున్నారు.
- By Prasad Published Date - 08:48 AM, Sun - 3 December 23

తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ పార్టీ ముందజలో ఉంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో చాలా మంది నాయకులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్ జరుగుతంది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఏపీలో నెలకొంది. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో వచ్చే ఎన్నికలపై ఉంటుందని నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది టీడీపీ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆ ఓటింగ్ అంతా కాంగ్రెస్ వైపు మళ్లుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్లలోకాంగ్రెస్ ముందజలో ఉండటంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందం వెల్లువిరుస్తుంది.