10th class exam : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలను, సిలబస్ ను పూర్తి చేసి రివిజన్ ప్రారంభిస్తామని ఎస్‌ఎస్‌సీ బోర్డ్ ప్రకటించింది.
- By Latha Suma Published Date - 04:24 PM, Thu - 19 December 24

10th class exam : తెలంగాణ పదోతరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 04 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలను, సిలబస్ ను పూర్తి చేసి రివిజన్ ప్రారంభిస్తామని ఎస్‌ఎస్‌సీ బోర్డ్ ప్రకటించింది.
Telangana 10th Time Table 2025
.మార్చి 21న (శుక్రవారం) – ఫస్ట్ లాంగ్వేజ్
.మార్చి 22న (శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
.మార్చి 24న (సోమవారం) – థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
.మార్చి 26న (బుధవారం) – గణితం
.మార్చి 28న (శుక్రవారం) – సైన్స్ (ఫిజికల్ సైన్స్)
.మార్చి 29న (శనివారం) – సైన్స్ (బయాలజీ)
.ఏప్రిల్ 2న (బుధవారం) – సోషల్ స్టడీస్
.ఏప్రిల్ 3న (గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1
.ఏప్రిల్ 4న (శుక్రవారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2
మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, మార్చి 26న మ్యాథ్స్, మార్చి 28 ఫిజికల్ సైన్స్, మార్చి 29న బయాలజికల్ సైన్స్, ఏప్రిల్ 02న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 03న OSSC లాంగ్వేజ్ పేపర్ 1, ఏప్రిల్ 04న OSSC లాంగ్వేజ్ పేపర్ 2 జరుగుతాయి. ఈ పరీక్షల షెడ్యూల్ లో ముఖ్యంగా ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు సెలవులు ఇచ్చారు. సెకండ్ లాంగ్వేజ్, బయాలజీ పరీక్షలకు మాత్రం ఎలాంటి సెలవు లేదు. వెంట వెంటనే జరుగనున్నాయి.
మరోవైపు ఏపీలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశారు. ఈ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2025 మార్చి 17 నుంచి 31 వరకు ఏపీ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే.. తెలంగాణ ఇంటర్ బోర్డు ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Read Also: AP Govt : దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆనందం నింపిన చంద్రబాబు