Teenmar Mallanna : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం
రెండు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో మల్లన్నకి బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు
- By Sudheer Published Date - 10:36 PM, Fri - 7 June 24

వరంగల్ – నల్లగొండ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ఘనవిజయం సాధించారు. రెండు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో మల్లన్నకి బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. చివరి దశలో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తో మల్లన్న, రాకేశ్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది.
We’re now on WhatsApp. Click to Join.
చివరికి బిఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో గురువారం రాత్రి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొనగా, ఆ పార్టీల తరఫున బరిలో దిగిన అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియను క్షుణ్నంగా పరిశీలించారు.
Read Also :