TDP Loyalty : చంద్రబాబు నిప్పంటూ కేశినేని సర్టిఫికేట్
TDP Loyalty : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశినేని శ్రీనివాసరావు అలియాస్ నాని సర్టిఫికేట్ ఇచ్చేశారు.
- By CS Rao Published Date - 03:44 PM, Fri - 8 September 23
TDP Loyalty : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశినేని శ్రీనివాసరావు అలియాస్ నాని సర్టిఫికేట్ ఇచ్చేశారు. దేశంలోని నీతిమంతమైన లీడర్లలో చంద్రబాబు ఒకరని చెప్పేశారు. ఆయన 40ఏళ్లు గా తెలుగు జాతికి అలుపెరగని సేవ చేస్తున్నారంటూ కొనియాడారు. దేశంలో చంద్రబాబు లాంటి నీతివంతమైన లీడర్ మరొకరు ఉండరని కీర్తించారు. ఐటీ నోటీసులు అనేవి చాలా కామన్ అంటూ కొట్టిపడేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. విజయవాడ ఎంపీగా మరోసారి పోటీ చేయబోతున్నానని చెబుతూ చంద్రబాబు నిజాయితీ, నిబద్ధతను ఆకాశానికి ఎత్తిశారు.
ఐటీ నోటీసులు అనేవి చాలా కామన్ అంటూ కొట్టిపడేశారు (TDP Loyalty)
విజయవాడ ఎంపీగా కేశినేనా నాని బదులుగా ఆయన తమ్ముడు చిన్ని పోటీ చేస్తున్నారని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. ఆయన్ను లోకేష్ ప్రోత్సహిస్తున్నారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఎంపీ స్టిక్కర్ తో కనిపించిన చిన్ని మీద కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వర్ల రామయ్య అంటే కేశినేనికి పడదు. వాళ్లను నానా రకాలుగా బూతులు తిడతారు. ఇటీవల వాళ్లను తిరుడుతూ వాడిన పదజాలం అందరికీ తెలిసిందే. వాళ్లందరూ అధిష్టానంకు మొరపెట్టుకున్నారు. అంతకు మించి ఏమీ చేయలేక (TDP Loyalty)ఉండిపోయారు. కానీ, సమయం చూసి ఎర్త్ పెట్టారు.
కేశినేని ఆకస్మాత్తుగా మీడియా ముందు చంద్రబాబును కీర్తించడం
రాబోవు రోజుల్లో విజయవాడ ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వకుండా తప్పిస్తున్నారని గ్రహించిన కేశినేని ఆకస్మాత్తుగా మీడియా ముందు చంద్రబాబును కీర్తించడం (TDP Loyalty) మొదలు పెట్టారు. గతంలో చంద్రబాబును చేతగాని రాజకీయాలు చేసే వాడిగా విమర్శిస్తూ పరోక్ష వ్యాఖ్యాలు చేశారు. పనికిమాలిన కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కానీ, ఇప్పుడు ఆయన వాయిస్ పూర్తిగా చంద్రబాబుకు దాసోహం అంటూ మారిపోయింది. నిజాయితీకి నిలువుటద్దం చంద్రబాబుకు కితాబు ఇస్తూ సర్టిఫికేట్ ఇచ్చేశారు.
Also Read : CBN Daring : బాంబులకే భయపడని చంద్రబాబు
గత వారం రోజులుగా చంద్రబాబు అవినీతి గురించి వైసీపీ పలు రకాలుగా ప్రచారం చేస్తోంది. ఆయనకు ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ చంద్రబాబును దోషిని చేసింది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో 118 కోట్లు సూట్ కేసు కంపెనీల ద్వారా పొందారని ఆరోపించింది. ఆ మేరకు నోటీసులు జారీ చేసిన ఐటీ రాబోవు రోజుల్లో ఈడీని రంగంలోకి దింపనుందని ఊహించింది. ఈసారి చంద్రబాబు తప్పించకోలేరని, అరెస్ట్ ఖాయమంటూ ఊదరగొట్టింది. వాళ్ల మాటలను విన్న చంద్రబాబు యథాలాపంగా మరో రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారంటా అంటూ వ్యాఖ్యానించారు. ఇంకేముంది చంద్రబాబు కూడా అరెస్ట్ కు రెడీ అయ్యారు. అంటే, ఆయన అక్రమ సంపాదన గురించి ఒప్పేసుకున్నారంటూ వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ కట్టి మీడియా ముందుకొచ్చి విమర్శలు, ఆరోపణలు చేయడానికి పోటీపడ్డారు.
చంద్రబాబు నాయుడికి కేశినేని నాని సర్టిఫికేట్ (TDP Loyalty)
ఐటీ నోటీసులు అందుకున్న చంద్రబాబు మీద వైసీపీ చేసిన ఆరోపణలకు కౌంటర్ అన్నట్టు చంద్రబాబు నాయుడికి కేశినేని నాని (TDP Loyalty) సర్టిఫికేట్ ఇచ్చేశారు. నీతి వంతమైన రాజకీయాలు చేస్తూ 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఆయన ఉన్నారని వివరించారు. ఆయనలాంటి లీడర్ మరొకరు ఉండరని కొనియాడారు. ఇదంతా మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం అంటూ సొంత పార్టీలోని వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. సర్వేలను సేకరించిన చంద్రబాబు విజయవాడ ఎంపీగా లగడపాటిని దింపుతున్నారట. అందుకే, ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు స్తోత్రాన్ని కేశినేని అందుకున్నారని విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లోని టాక్. ఇక కేశినేని రాజకీయం టీడీపీలో ముగిసిన ఎపిసోడ్ అంటూ ఆ పార్టీలోని వాళ్లే చర్చించుకుంటున్నారు. ఇక ఆయన ఇచ్చే సర్టిఫికేట్ చంద్రబాబుకు అవసరంలేదని, తమ నాయకుడు ఎప్పుడూ నిప్పేనంటూ తేల్చేస్తున్నారు.
Also Read : Indraprastham : మళ్లీ తెరమీదకు YSR -CBN వెబ్ సిరీస్
Related News
Pawan Kalyan : ఆమె కోసం చంద్రబాబుని సహాయం అడిగిన పవన్.. నిర్మాత కామెంట్స్..
ఆమె కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి చంద్రబాబుని సహాయం అడిగారు. తాజా ఇంటర్వ్యూలో నిర్మాత ఆసక్తికర కామెంట్స్..