HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Inaugurated Lalitha Super Specialty Hospital In Guntur

CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 03-06-2026 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu inaugurated the Lalitha PVS Institute of Medical Sciences Hospital in Guntur.
CM Chandrababu inaugurated the Lalitha PVS Institute of Medical Sciences Hospital in Guntur.

రాజధాని అమరావతిని భవిష్యత్తులో ప్రపంచస్థాయి ఆరోగ్య కేంద్రంగా (గ్లోబల్ హెల్త్ హబ్) తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో హైదరాబాద్‌లో హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించిన విధంగానే, రాబోయే రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి రోగులు అమరావతికి వచ్చి చికిత్స పొందేలా వసతులను కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గుంటూరులో 600 పడకలతో, 32 విభాగాలతో, అత్యాధునిక వసతులతో లలితా ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఉందన్నారు. ముఖ్యంగా, దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఆధునిక ఎమ్ఆర్ఐ స్కాన్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. “ఒక బ్రాండ్‌కు విలువలు, ప్రజల్లో విశ్వసనీయత తోడైతే దానికి తిరుగుండదు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ అందుకు నిదర్శనం” అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు

రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని సమూలంగా మారుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. “ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ‘సంజీవని’ ప్రాజెక్టును తీసుకొచ్చాం. దీని ద్వారా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులను నిర్వహిస్తాం. వ్యాధి రాకముందే గుర్తించడం (ప్రిడిక్టివ్), రాకుండా నివారించడం (ప్రివెంటివ్), వచ్చాక నయం చేయడం (క్యూరేటివ్) అనే త్రిముఖ వ్యూహంతో పనిచేస్తాం. ఇంటి వద్దకే వచ్చి 42 రకాల వైద్య పరీక్షలు చేస్తాం” అని వివరించారు. రాష్ట్రంలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని అమలు చేసి, ప్రతి కుటుంబానికి రూ. 2.5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆరోగ్యమే అసలైన సంపద అని, ఆరోగ్యకరమైన పౌరులే సంపన్న దేశాన్ని నిర్మిస్తారని చంద్రబాబు అన్నారు. మంచి ఆహారం, వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. “మన వంటిల్లే మన ఫార్మసీ. మనం తినే ఆహారమే మనకు రక్ష. కానీ ఈ రోజుల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం పెరిగిపోయింది” అని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఆసుపత్రులు కట్టినా, ప్రజల జీవనశైలిలో మార్పు రానంత వరకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదని హితవు పలికారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • guntur
  • Lalitha PVS Institute of Medical Sciences
  • Lalitha Super Specialty Hospital
  • Super Specialty Hospital

Related News

9 arrested in Guntur case involving the stripping of a woman.

Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి, తీవ్రంగా వేధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణాబాబు కాలనీకి చెందిన బాధితురాలు తన ఇంటి తాగునీటి పైప్‌లైన్‌కు నీళ్ల మోటారును అమర్చుకోగా, స్థానిక నిందితుడైన మల్లెల వెంకట రమణమూర్తి ఆమెను రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఆమె భర్త నిరాకరించడంతో, రమణమూర్తి అధికారులతో మాట్ల

  • Good news for Anganwadi workers: ‘Thalliki Vandanam’ scheme to apply.

    Talliki Vandanam: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ పథకం వర్తింపు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd