CBN Daring : బాంబులకే భయపడని చంద్రబాబు
CBN Daring : చంద్రబాబునాయుడు బాంబులు, క్లైమోర్ మైన్స్ కే భయపడలేదు. ఇప్పుడు అరెస్ట్ లకు భయడతారా? అంటే లేదంటున్నారు టీడీపీ లీడర్లు.
- By CS Rao Published Date - 01:12 PM, Thu - 7 September 23

CBN Daring : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బాంబులు, క్లైమోర్ మైన్స్ కే భయపడలేదు. ఇప్పుడు అరెస్ట్ లకు భయడతారా? అంటే లేదంటున్నారు టీడీపీ లీడర్లు. కాదు, ఆయన భయపడుతున్నారని వైసీపీ మైండ్ గేమ్ మొదలు పెట్టింది. గత వారం రోజులు ఐటీ ఇచ్చిన నోటీసుల మీద పలు రకాల ఊహాగాలకు తెరలేపింది. రేపో,మాపో అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని చంద్రబాబు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం కేంద్రంగా పెట్టిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో యథాలాపంగా అన్నారు. దాన్ని ఒక హైలెట్ చేస్తూ వైసీపీ మరో మైండ్ గేమ్ మొదలు పెట్టింది.
చంద్రబాబునాయుడు క్లైమోర్ మైన్స్ కే భయపడలేదు (CBN Daring)
సాధారణంగా ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తే సానుభూతి (CBN Daring) క్రియేట్ అవుతుంది. ఆ విషయం వైసీపీకే కాదు, అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీకి తిరుగులేని సానుభూతి లభిస్తుంది.పైగా ఇటీవల టీడీపీ క్యాడర్ మీద చేసిన దాడులు, దౌర్జన్యాలు అన్నీఇన్నీకావు. వాటిని ప్రజలకు తెలియచేయడంలోనూ టీడీపీ పైచేయిగా నిలిచింది. తాజాగా చంద్రబాబునాయుడు మీద చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని అంగళ్లు వద్ద దాడి జరిగింది. జడ్ ప్లస్ రక్షణ కలిగిన ఆయన మీద వైసీపీ చేసిన దాడి సర్వత్రా చర్చనీయాంశం అయింది.
భీమవరం కేంద్రంగా లోకేస్ యువగళం
ప్రస్తుతం భీమవరం కేంద్రంగా లోకేస్ యువగళం కొనసాగుతోంది. ఆ సందర్భంగా యాత్ర మీద వైసీపీ క్యాడర్ దాడులు చేసింది. రాళ్లు రువ్విందని టీడీపీ చెబుతోంది. ప్రతిగా టీడీపీ క్యాడర్ తిరగబడింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తతను తగ్గించే క్రమంలో టీడీపీ క్యాడర్, లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ కోర్టుకు హాజరు పరిచారు. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్యానిక్ సిట్యువేషన్స్ ను క్రియేట్ చేయడానికి అంటూ టీడీపీ భావిస్తోంది. అందుకే, చంద్రబాబు (CBN Daring) క్యాడర్ కు ధైర్యం నూరిపోయడానికి సిద్దపడ్డారు.
Also Read : CBN No Arrest : ఆగడు..ఆపలేరు.! ఐటీతో అరెస్ట్ తూచ్.!
తిరుపతి అలపిరి వద్ద జరిగిన బాంబు దాడులను చంద్రబాబు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో నక్సల్స్ ఆయన మీద క్లైమోర్ మైన్స్ ను పేల్చారు. ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. కానీ, చంద్రబాబు మాత్రం ధైర్యంగా పేలిన కారులో నుంచి బయట వచ్చారు. ఏ మాత్రం భయపడకుండా వీరోచితంగా బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన బెదరలేదు. అందోళన చెందలేదు. వెంటనే కోలుకుని మళ్లీ సీఎంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా విజన్ ను రూపొందించారు. ఆ ఫలాలను ఇప్పుడు ఉమ్మడి ఏపీ ప్రజలు అనుభవిస్తున్నారు. అదే విషయాన్ని చెబుతూ చంద్రబాబు (CBN Daring) భయపడేది లేదంటూ వైసీపీకి సవాల్ విసిరారు.
Also Read : CBN Arrest : రెండు రోజుల్లో అరెస్ట్, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తొలి ఏడాది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను వైసీపీ వెంటాడింది. మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్రలను అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ధూళ్లిపాళ్ల నరేంద్ర, ప్రభాకర్ చౌదరి తదితరులను అరెస్ట చేసి జైలుకు పంపారు. ఆ తరువాత మాజీ మంత్రి నారాయణ, పుల్లారావు, అయ్యన్నపాత్రుడు తదితరుల మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జోగి రమేష్ అండ్ కో దాడులకు దిగారు. పలు చోట్ల టీడీపీ క్యాడర్ మీద ఘర్షణలకు వైసీపీ పూనుకుంది. ఎన్నికలను ఉద్రిక్తత పరిస్థితుల మధ్య నడపాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని టీడీపీ విశ్వసిస్తోంది. అందుకే, క్యాడర్ కు ధైర్యం నూరిపోసేలా చంద్రబాబు తన ప్రసంగాలకు మరింత పదునుపెడుతున్నారు. ఆ దిశగా బాంబులకే భయపడలేదు..అరెస్ట్ లకు భయపడతానా? అంటూ సవాల్ విసిరారు.