HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Leader Bojjala Gopala Krishna Reddy Passed Away

Bojjala Gopala Krishna: టీడీపీ నేత బొజ్జల ఇకలేరు!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు.

  • Author : Balu J Date : 06-05-2022 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bojjala
Bojjala

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(73) 1989 నుంచి వరుసగా మూడు సార్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు, 2004 లో ఓటమి పాలైనా.. తిరిగి 2009,2014 ఎన్నికల్లో విజయం సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బొజ్జల.. 2003 లో అలిపిరి వద్ద అప్పటి సీఎం చంద్రబాబుపై జరిగిన బాంబు దాడి ఘటనలో తృటిలో స్వల్ప గాయాలతో తప్పించుకొన్నారు. బొజ్జల మరణం పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

బొజ్జల మృతి పట్ల గవర్నర్ సంతాపం

మాజీ మంత్రి, సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో శనివారం ఆయన మరణించగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bojjala Gopala Krishna Reddy
  • TDP leader

Related News

Ap Logo

Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

ఏపీ ప్రభుత్వం కొత్త ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలో పలు నిబంధనలకు సవరణలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పస్‌ ఫండ్‌, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల విన్నపాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.15 లక్షల కార్పస్‌ ఫండ్‌ను రద్దు చేశారు.

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

Latest News

  • Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ

  • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

  • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

  • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd