HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Tdp Cadre Should Exercise Restraint

Chandrababu : TDP క్యాడర్ సంయమనం పాటించాలి – చంద్రబాబు

వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి....ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు

  • By Sudheer Published Date - 07:01 PM, Fri - 7 June 24
  • daily-hunt
Cbn Tdp
Cbn Tdp

టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో కూటమి శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈ ఐదేళ్లలో తమను అనేక బాధలకు, ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నేతలపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతో పలు ఘర్షణలు జరుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో ఆయన నివాసం ఉంటున్న ఓ అపార్ట్మెంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వంశీ బయటకు రావాలి అంటూ నినాదాలు చేశారు. వంశీని వదిలేది లేదంటూ హెచ్చరించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద కూడా టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు విసిరారు. దీంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత పెంచారు. ఇలా అనేక చోట్ల ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకోవడం తో వీటిపై చంద్రబాబు అరా తీశారు.

వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి….ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలని అన్నారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read Also : T20 World Cup 2024: భారత్ – పాక్ మ్యాచ్.. ఐసీసీ కీలక నిర్ణయం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • tdp
  • ycp

Related News

Super Sm

“Super Six Super Hit” Public Meeting : నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

"Super Six Super Hit" Public Meeting : రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సభలో వివరించనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలియజేయనున్నారు

  • Nara Lokesh Telugu

    Telugu Pride & Bharat First : ‘తెలుగు ఆత్మగౌరవమే’ టీడీపీ సిద్ధాంతం – నారా లోకేష్

  • Nara Lokesh Nda

    TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే..స్పష్టం చేసిన నారా లోకేష్

  • Nara Lokesh Skill Census Vs

    Skill Census vs Caste Census : కుల గణన పై చంద్రబాబు ఆలోచనను బయటపెట్టిన లోకేష్

  • Nara Lokesh National Educat

    National Education Policy : జాతీయ విద్యా విధానంపై లోకేష్ మనుసులో మాట

Latest News

  • CM Revanth Reddy : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

  • Canada : భారత విద్యార్థులకు కెనడా భారీ షాక్.. 80 శాతం వీసాల తిరస్కరణ!

  • High Alert : నేపాల్‌లో ఉద్రిక్తతలు: భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్..రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత

  • Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!

  • Kumari Aunty : నెట్టింట వైరల్‌గా మారిన కుమారీ ఆంటీ వీడియో

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd