Tata Ev Battery : ఇక టాటా ఈవీ బ్యాటరీలు..13000 కోట్లతో ప్లాంట్
Tata Ev Battery : ఉప్పు నుంచి ఉక్కు దాకా.. హోటల్ నుంచి విమానం దాకా ప్రతి బిజినెస్ లో టాటా గ్రూప్ ఉంది. ఇప్పుడీ మహా వ్యాపార సంస్థ మరో కొత్త బిజినెస్ లోకి ఎంటర్ కాబోతోంది. అదే.. ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) బ్యాటరీల తయారీ రంగం.
- By Pasha Published Date - 11:07 AM, Mon - 5 June 23

Tata Ev Battery : ఉప్పు నుంచి ఉక్కు దాకా..
హోటల్ నుంచి విమానం దాకా ప్రతి బిజినెస్ లో టాటా గ్రూప్ ఉంది.
ఇప్పుడీ మహా వ్యాపార సంస్థ మరో కొత్త బిజినెస్ లోకి ఎంటర్ కాబోతోంది.
అదే.. ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) బ్యాటరీల తయారీ రంగం.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగం ఇప్పుడే స్పీడ్ అందుకుంటోంది. భవిష్యత్ లో ఈ స్పీడ్ ఇంకా పెరుగుతుంది. ఆ వాహనాల కోసం బ్యాటరీల అవసరం చాలా పెరుగుతుంది. ఈ మార్పును అంచనా వేసిన టాటా గ్రూప్ దాదాపుగా రూ. 13,000 కోట్లతో గుజరాత్ లో ఈవీ బ్యాటరీల (Tata Ev Battery) తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 20 గిగావాట్ అవర్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగిన ఈవీ బ్యాటరీల తయారీ ప్లాంట్ ను టాట్ గ్రూప్ గుజరాత్ లో నెలకొల్పనుంది.
Also read : Ratan Tata biopic: తెరపైకి రతన్ టాటా జీవితం.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ఈ ప్లాంట్ కోసం టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అగరాటాస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టనుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 13,000 మందికి ఉపాధి కల్పించనుంది. టాటా గ్రూప్ బ్రిటన్ లో ఉన్న తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూనిట్ లో EV బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న తరుణంలోనే ఈ ప్రకటన కూడా వెలువడటం గమనార్హం. ఇటీవల మనదేశంలోని జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లిథియం నిల్వలు బయటపడ్డాయి. భవిష్యత్తులో అవి అందుబాటులోకి వస్తే.. భారత్ లోనే చౌకగా ఈవీ బ్యాటరీలు తయారవుతాయి. ఈ అవకాశాన్నిటాటా గ్రూప్ లాంటి కంపెనీలు చేజిక్కించుకునే ఛాన్స్ ఉంది.