Ratan Tata biopic: తెరపైకి రతన్ టాటా జీవితం.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవిత కథ తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.
- Author : Gopichand
Date : 23-11-2022 - 7:21 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవిత కథ తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సినిమాను దర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కథకు సంబంధించిన పరిశోధనలు కీలక దశలో ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ మూవీ కార్యరూపం దాల్చనుందని ప్రచారం అవుతోంది. స్క్రిప్ట్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. సూర్య, అభిషేక్ బచ్చన్ ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు సమాచారం.
రతన్ టాటా మన దేశంలోని ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలలో ఒకరు. అతని కథను వెండితెరపైకి తీసుకురావడం గర్వించదగిన విషయం. ఈ చిత్రం టాటా జీవితంలోని అనేక కోణాలను తీసుకువస్తుంది. ప్రజలకు అందుబాటులో లేని అనేక సంఘటనలను కూడా ప్రదర్శిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అతని జీవితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమాను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో సూర్య లేదా అభిషేక్ బచ్చన్ రతన్ టాటాగా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి దర్శకురాలు సుధ కొంగర సూరారై పోట్రు హిందీ రీమేక్ సినిమా చేస్తున్నారు. కొంగర.. గురు అనే పేరుతో తెలుగులో వెంకటేష్ హీరోగా రూపొందించి రిలీజ్ చేసారు. అది తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ కోసం కొన్ని ఆంథోలాజి సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతానికి సూరారై పోట్రు హిందీ వెర్షన్ చేస్తున్నారు.