Formula E Race : సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు
Formula E Race : ఫార్ములా ఈ కారు రేస్ కేసు (Formula E race)లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు
- By Sudheer Published Date - 12:39 PM, Wed - 15 January 25

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ (Supreme Court Big Shock) ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు (Formula E race)లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2025 జనవరి 15వ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సుప్రీం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు.
Daku Maharaj : సోదరుడు బాలకృష్ణ నటనపై ఎంపీ పురందేశ్వరి ప్రశంసలు
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో తనపై నమోదైన అక్రమ కేసును కొట్టేయాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్‌పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారించింది. ఈ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానంలో 37వ నంబర్‌గా లిస్ట్ అయింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.