CM Arvind Kejriwal: తీహార్ జైలుకు చేరుకున్న భార్య సునీత, మంత్రి అతిషి
లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు తీహార్ జైలుకు చేరుకున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. ఆమెతోపాటు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి కూడా ఉన్నారు.
- Author : Praveen Aluthuru
Date : 29-04-2024 - 1:53 IST
Published By : Hashtagu Telugu Desk
CM Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు తీహార్ జైలుకు చేరుకున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. ఆమెతోపాటు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి కూడా ఉన్నారు.
జైలు నిబంధనల ప్రకారం జైలులో ఉన్న వ్యక్తిని వారానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే కలుసుకోవడానికి అనుమతిస్తారు. సోమవారం ముఖ్యమంత్రిని కలవడానికి సునీత, అతిషి లకి ఇప్పటికే అనుమతి లభించింది. అతిషి గత వారం ఏప్రిల్ 29న కేజ్రీవాల్‌ను కలవడానికి దరఖాస్తు చేసుకోగా, తీహార్ జైలు అధికారులు ఆమె దరఖాస్తును అదే రోజు స్వీకరించింది. కాగా కేజ్రీవాల్ భార్యకు మొదట అనుమతిని నిరాకరించారు.. అయితే ఈ రోజు సీఎంను కలిసేందుకు అనుమతినిచ్చారు. దీంతో వీరిద్దరూ కలిసి తీహార్ జైలుకు చేరుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీ సీఎంతో భేటీలో భాగంగా మంత్రి అతిషి ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై సీఎంతో చర్చించనున్నారు. మరోవైపు లోకసభ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వారికి దిశానిర్దేశం చేసే అవకాశముంది. కాగా రేపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.
Also Read: Akshay Kanti Bam : బీజేపీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థి.. నామినేషన్ విత్‌డ్రా