HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Summons To Wife And Son Of Himachal Pradesh Former Cm In Domestic Violence Case

Himachal Pradesh : గృహహింస కేసులో మాజీ సీఎం భార్య, కుమారుడికి సమన్లు

విక్రమాదిత్య సింగ్ మాజీ భార్య సుదర్శన్ సింగ్ ఛుండావత్ వేసిన గృహ హింస (Domestic Violence)

  • Author : Maheswara Rao Nadella Date : 16-12-2022 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Himachal Pradesh Domestic Violence
Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ (Pratibha Singh), ఆమె కుమారుడు, సిమ్లా ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) చిక్కుల్లో పడ్డారు. విక్రమాదిత్య సింగ్ మాజీ భార్య సుదర్శన్ సింగ్ ఛుండావత్ (Sundarshan singh Chundawat) వేసిన గృహ హింస (Domestic violence) కేసులో ప్రతిభ, విక్రమాదిత్యకు కోర్టు సమన్లు పంపింది. భర్త, అత్త, వదిన, బావ కలిసి తనను వేధింపులు గురిచేసేవారని, గృహ హింసకు పాల్పడ్డారని సుదర్శన్ సింగ్ ఛుండావత్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం సీఎం పదవికి ప్రతిభా సింగ్ పోటీపడ్డారు. రాష్ట్రంలో అతి పెద్ద నేతగా పేరున్న వీరభద్ర సింగ్ గత ఏడాది కన్నుమూశారు. కాగా, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఛుండావత్ గృహహింస కేసుతో పాటు మరో కేసులో ఛండీగఢ్‌కు చెందిన అమ్రీన్ అనే మహిళతో తన భర్త సంబంధాలు సాగించేవాడని ఆరోపించారు. తన కదలికలపై నిఘా కోసం తానుండే గదిలో సీసీటీవీ కెమెరాలను విక్రమాదిత్య ఏర్పాటు చేశాడని ఆమె పేర్కొన్నారు. గృహ హింస కేసులో జనవరిలో తమ ముందు హాజరుకావాలని ఉదంపూర్ కోర్టు ప్రతిభ, విక్రమాదిత్యను ఆదేశించగా, రెండో కేసులో తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఛుండావత్ కోరారు. విక్రమాదిత్య, ఛుండావత్‌లు 2019 మార్చిలో వివాహం చేసుకున్నారు.

వీరభద్ర సింగ్ మరణాంతరం తనను పుట్టింటికి పొమ్మని భర్త బలవంతం చేశాడని, తన నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడని ఛుండావత్ ఆరోపించారు. కాగా, గృహ హింస కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు వైరల్ అయ్యారు. దీనిపై విక్రమాదిత్య స్పందిస్తూ, తనకు కానీ, తన కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ కాలేదని వివరణ ఇచ్చారు.
తామెలాంటి తప్పూ చేయలేదని, తమకు నాన్‌బెయిల్ వారెంట్లు జారీ అయ్యే ప్రశ్నే లేదని ఒక వీడియోలో ఆయన చెప్పారు. కుటుంబానికి చెందిన
వ్యక్తిగత అంశాలపై తాను వ్యాఖ్యానించేది లేదన్నారు. కోర్టులో మధ్యవర్తిత్వం ద్వారానే ఆమోదయోగ్యమైన రీతిలో ఈ అంశం పరిష్కారమవుతునందని చెప్పారు.

Also Read:  Sandeep Kishan : రెజీనా తో సందీప్ కిషన్ ప్రేమాయణం?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • case
  • cm
  • Domestic Violence
  • Himachal Pradesh
  • india
  • police
  • summons
  • trending

Related News

Atrocities Act case has reportedly been registered against Palash Muchhal

Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్‌ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సినిమా ప్రాజెక్టు పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ సామాజిక కార్యకర్త విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజ్ఞాన్ మానే.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు క

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd