Central Govt: ఇకపై ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- By Balu J Published Date - 12:10 PM, Wed - 19 April 23

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే మల్టీటాస్కింగ్ స్టాఫ్ పరీక్షలతో పాటు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిర్ణయించింది. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ప్రశ్నా పత్రాలను రూపొందిస్తామని కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు, బెంగాలీ, అస్సామీ, గుజరాత్, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ్, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరి, కొంకణి భాషల్లో పరీక్షలు (Exams) నిర్వహిస్తామని పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్- సీ పోస్టులను ప్రాంతీయ భాషల్లో (Local language) కూడా నిర్వహించనున్నట్టు వివరించింది.
Also Read: Pooja Hegde: ప్రతి రూమర్ కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు : పూజాహెగ్డే