Shashi Tharoor: నడవలేని స్థితిలో లోక్‌సభ ఎంపీ శశి థరూర్.. కారణమిదే..?
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) గురువారం (డిసెంబర్ 15) పార్లమెంట్ హౌస్ మెట్లపై జారి పడ్డారు. పార్లమెంటులో దిగుతుండగా కాలు జారిపోయిందని థరూర్ (Shashi Tharoor) శుక్రవారం ట్వీట్ చేశారు.
- By Gopichand Published Date - 04:50 PM, Fri - 16 December 22

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) గురువారం (డిసెంబర్ 15) పార్లమెంట్ హౌస్ మెట్లపై జారి పడ్డారు. పార్లమెంటులో దిగుతుండగా కాలు జారిపోయిందని థరూర్ (Shashi Tharoor) శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మెట్లపై పడిపోవడంతో కాలు బెణికింది. తాను అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నానని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని లోక్‌సభ ఎంపీ తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్నందున నియోజవర్గ పరిధిలో తాను హాజరుకావాల్సిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు శశిథరూర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తొలుత గాయం చిన్నదేనని భావించామని థరూర్ తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లగా గాయం పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ గాయం కారణంగా ఇప్పుడు తాను కదలలేకపోతున్నానని థరూర్ రాశాడు. సభా కార్యక్రమాలను మిస్ అవుతున్నట్లు తెలిపారు. శశి థరూర్ ట్విటర్‌లో ఇలా వ్రాశారు. చిన్న అసౌకర్యం. గురువారం పార్లమెంటులో మెట్లు దిగుతుండగా నేను జారిపడి నా కాలు బెణికింది. కొన్ని గంటలు పర్వాలేదు కానీ కొన్ని గంటలపాటు దానిని పట్టించుకోకుండా ఉన్నాను. దాంతో నొప్పి ఎక్కువ అయ్యింది. ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాను. శుక్రవారం సభా కార్యక్రమాలను మిస్ అవుతున్నాను. అలాగే నియోజకవర్గంలో ఇంతకుముందు షెడ్యూల్ చేసిన కార్యక్రమాలు కూడా రద్దు చేయబడ్డాయి అని ఆయన పేర్కొన్నారు.
Also Read: Madhya Pradesh : నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫోటో వైరల్..
ఈ సమయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు శశి థరూర్ కూడా రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రభుత్వం ఒక చిన్న ప్రకటన చేసిందని, దానికి ఎలాంటి వివరణ ఇవ్వలేదని, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లేదని కాంగ్రెస్ నాయకుడు బుధవారం అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు. థరూర్ పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఎలాంటి వివరణ లేకుండా ఒక చిన్న ప్రకటన చేశారు. ఇతరుల ప్రశ్నలు లేదా అభిప్రాయాలు కూడా విలేదు. ఇది ప్రజాస్వామ్యం కాదు.’ అని ఆయన అన్నారు. ఈ ఏడాది జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే చేతిలో థరూర్ ఓడిపోయారు.
A bit of an inconvenience: I badly sprained my left foot in missing a step in Parliament yesterday. After ignoring it for a few hours the pain had become so acute that I had to go to hospital. Am now immobilised w/a cast, missing Parliament today&cancelled wknd constituency plans pic.twitter.com/Ksj0FuchZZ
— Shashi Tharoor (@ShashiTharoor) December 16, 2022