TTD : రేపు సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
- By Vara Prasad Updated On - 08:56 AM, Wed - 6 July 22

సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల(రూ.300)ను రేపు టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ కోటా చెందిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఈ రోజు(బుధవారం) ఉదయం 9 గంటలకు 12, 15,17 తేదీల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Related News

Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమ య్యాయి.