Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం… డిప్యూటీ సీఎం అరెస్ట్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం జరిగింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని
- By Anshu Published Date - 09:25 PM, Sun - 26 February 23

Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం జరిగింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని నిబంధలకు విరుద్ధంగా టెండర్ల అప్పగించారని ఆయనపై ముందు నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ ఇవాళ మరోసారి ప్రశ్నించింది.
మనీశ్ సిసోడిమాను సీబీఐ దాదాపు 8 గంటల విచారించింది. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని సీబీఐ తెలిపింది. అందులో మనీశ్ సిసోడియా హస్తముందని వెల్లడించింది. బ్యూరోక్రాట్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయన్ను అరెస్ట్ చేసింది.
ఈ కేసులో తనను ప్రశ్నించేందుకు సీబీఐ పిలిచినప్పుడే తన అరెస్ట్‌పై అనుమానం వ్యక్తం చేశారు మనీష్ సిసోడియా. సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లే ముందు సిసోడియా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. నేను ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా భయపడను. నేను జర్నలిస్టు ఉద్యోగం మానేసినప్పుడు, నా భార్య నాకు మద్దతుగా నిలిచింది. నేటికీ మా కుటుంబం నాకు అండగా నిలుస్తోంది. నన్ను అరెస్టు చేస్తే మా కార్యకర్తలు నా కుటుంబాన్ని ఆదుకుంటారని ఆయన పేర్కొన్నారు.
మనీశ్ సిసోడియా అరెస్ట్‌పై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఘాటుగా ట్వీట్ చేశారు. స్పా మసాజ్ పార్టీకి చెందిన నిజాయితీ లేని మనీశ్ అరెస్టయ్యాడు. సత్యేంద్ర జైన్ అవినీతి శ్రీ మనీష్ సిసోడియా అవినీతి భూషణ్ అరవింద్ కేజ్రీవాల్ అవినీతి రత్న అని పేర్కొన్నారు.