HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >School Bus Overturns In Gurazala 10 Students Injured

School Bus Overturns: గురజాలలో స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా (School Bus Overturns) కొట్టింది. గంగవరం గ్రామ సమీపంలో గుడ్‌న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుకు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ పక్కకు తప్పించబోయి టైర్ స్లిప్ కావడంతో బోల్తా పడింది.

  • Author : Gopichand Date : 06-01-2023 - 10:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
School Bus
Resizeimagesize (1280 X 720) (1)

పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా (School Bus Overturns) కొట్టింది. గంగవరం గ్రామ సమీపంలో గుడ్‌న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుకు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ పక్కకు తప్పించబోయి టైర్ స్లిప్ కావడంతో బోల్తా పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

Also Read: Trainee Plane Crash: గుడి గోపురాన్ని ఢీకొన్న ట్రైనీ విమానం.. సీనియర్ పైలట్ మృతి

గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతావారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. విద్యార్థుల స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి విద్యార్థులను బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 students injured
  • andhra pradesh
  • Gurazala
  • palnadu
  • School Bus Overturns

Related News

    Latest News

    • Vijayawada Durgamma Temple: దుర్గమ్మ ఆలయ క్యూలైన్ లో 50 లక్షల బంగారం మాయం !!

    • OLX Scam: మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. !!

    • Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

    • అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన సూర్య‌ సేన

    • S Saraswathi Story : ఏంటి..సరస్వతి మూవీ కథ ఆ రచయితదా ? సోషల్ మీడియా లో వార్ !

    Trending News

      • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

      • ఏ కారు కొంటే మంచిది?!

      • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

      • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

      • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd