Sangameshwara Temple: కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది!
కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది.
- By Balu J Published Date - 11:39 AM, Wed - 25 January 23

కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది. శ్రీశైల జలాశయం నీటిమట్టం మంగళవారం 843 అడుగులకు తగ్గటంతో గర్భాలయం ప్రహరీ వరకు బయటపడింది. ఇంకో ఐదు అడుగుల మేర నీటిమట్టం తగ్గితే ఆదివారానికి ఆలయం పూర్తిగా బయటపడుతోందని, రెండు రోజులపాటు ఆలయాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పురోహితులు తెలిపారు. ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి రోజున సంగమేశ్వరుడు తొలి పూజ అందుకునే అవకాశముందని వివరించారు.