Epuri Somanna: షర్మిల్ కు బిగ్ షాక్, బిఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న!
ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.
- By Balu J Published Date - 05:03 PM, Fri - 22 September 23
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ కార్యాచరణ ను వేగవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలంగాణలోని నియోజకవర్గాలు, ముఖ్య ప్రాంతాలు గురి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అసంత్రుప్త ఎమ్మెల్యేలు, పార్టీ చేరికలపై ద్రుష్టి సారించారు. తాజాగా ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఇవాళ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశాడు. త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఏపూరి సోమన్న నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఏపూరి సోమన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతూర్తి నియోజకవర్గంలోని వెలిశాల గ్రామానికి చెందినవారు. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం సోమన్నకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగావకాశాన్ని కల్పించినా.. కొన్ని రోజులకు ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. ప్రభుత్వంపై తన పాటల ద్వారా పోరాటాన్ని సాగించారు. అనంతరం కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీలో చేరి గత ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. తన సాంస్కృతిక బృందంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన షర్మిల పార్టీలో చేరారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కారణంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Also Read: KGF Hero: నిర్మాతగా మారిన కేజీఎఫ్ హీరో
Related News
Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.