Telangana: హయత్‌నగర్, నాచారంలో రూ.3.20 కోట్లు స్వాధీనం
బుధవారం రాత్రి పోలీసులు హయత్ నగర్ , నాచారం పోలీస్ స్టేషన్ల పరిధిలో రూ.3.20 కోట్ల చేశారు.పెద్ద అంబర్‌పేటలోని సదాశివ ఎన్‌క్లేవ్ నుంచి పెద్దఎత్తున నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో
- Author : Praveen Aluthuru
Date : 23-11-2023 - 3:31 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: బుధవారం రాత్రి పోలీసులు హయత్ నగర్ , నాచారం పోలీస్ స్టేషన్ల పరిధిలో రూ.3.20 కోట్ల చేశారు.పెద్ద అంబర్‌పేటలోని సదాశివ ఎన్‌క్లేవ్ నుంచి పెద్దఎత్తున నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓఆర్‌ఆర్ సమీపంలో కారు తనిఖీ చేశారు .కారులో రూ.2 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. హయత్‌నగర్‌కు చెందిన సంపతి శివకుమార్‌రెడ్డి సూరకంటి మహేందర్‌రెడ్డి, తాటికొండ మహేందర్‌రెడ్డి, నిమ్మి నవీన్‌కుమార్‌రెడ్డి, సుర్వి రమేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ డబ్బును చౌటుప్పల్‌కు తరలిస్తున్నట్లు తేలిందని ఎల్‌బీనగర్ అదనపు డీసీపీ కోటేశ్వర్‌రావు తెలిపారు.
ఎల్‌బీ నగర్‌కు చెందిన బండి సుధీర్‌రెడ్డి పాత కార్లు విక్రయిస్తుండగా బుధవారం కారులో భువనగిరి వెళ్తుండగా నాచారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముందు తలుపులు తీసినంత సులువుగా వెనుక తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చి చూడగా రూ. 1.20 కోట్ల నగదు వెలుగు చూసింది.హబ్సిగూడలోని లక్ష్మారెడ్డి నుంచి ఈ డబ్బును తీసుకుంటున్నట్లు గుర్తించామని మల్కాజిగిరి అదనపు డీసీపీ వెంకటరమణ, సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
Also Read: Barrelakka Manifesto: బర్రెలక్క ఎన్నికల మేనిఫెస్టో..