Golden Globe Awards 2023: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు అవార్డు లభించింది.
- Author : Gopichand
Date : 11-01-2023 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు అవార్డు లభించింది. అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) స్వీకరించారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో RRR మూవీ చరిత్ర సృష్టించింది. రెండు కేటగిరీల్లో పోటీ పడుతున్న ఈ మూవీ.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్‌ను సొంతం చేసుకుంది. నాటునాటు పాటకు వచ్చిన ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందుకున్నారు. దీంతో పాటు ఆంగ్లేతర ఉత్తమ చిత్రం రేసులోనూ ఆర్ఆర్ఆర్ దూసుకెళ్తోంది.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈమేరకు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అవార్డ్‌ని సంగీత దర్శకుడు కీరవాణి అందుకోగా, స్టేజ్ కింద రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ చప్పట్లతో హోరెత్తించారు. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా అవార్డుల వేడుకలో డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి కుటుంబసమేతంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ‘నాటు నాటు’ పాటకు చరణ్, తారక్, రాజమౌళి చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేసి అలరించారు.
MM Keeravaani’s #GoldenGlobes2023 acceptance Speech!! ❤️🔥❤️🔥 #RRRMovie #NaatuNaatu pic.twitter.com/9q7DY7Pn5G
— RRR Movie (@RRRMovie) January 11, 2023
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో కీరవాణికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చారిత్రాత్మక, అపూర్వమైన విజయం. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి, రాజమౌళికి శుభాకాంక్షలు. మీ వల్ల భారతదేశం గర్విస్తోంది అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.