Ropeways: మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పర్యాటక ప్రదేశాల్లో రోప్‌వేలకు సన్నాహాలు!
బల్తాల్ నుండి అమర్‌నాథ్ ఆలయానికి 11.6 కి.మీ పొడవున్న రోప్‌వేను ప్రతిపాదించడం జాబితాలో అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం బాల్తాల్ లేదా పహల్గామ్ నుండి కాలినడకన లేదా హెలికాప్టర్ ద్వారా గుహను చేరుకోవడానికి ఏకైక మార్గం.
- By Gopichand Published Date - 01:32 PM, Tue - 28 January 25

Ropeways: దేశవ్యాప్తంగా భక్తులకు ఓ గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 18 ప్రధాన మతపరమైన, పర్యాటక ప్రదేశాలలో రోప్‌వే (Ropeways) ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. జనవరి 25, 2025న భారతదేశం అంతటా 18 రోప్‌వే ప్రాజెక్ట్‌ల కోసం డిపిఆర్ అంటే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కన్సల్టెంట్‌లను ఆహ్వానించింది. మతపరమైన, పర్యాటక ప్రదేశాలకు చేరుకోవడానికి అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన వారికి రోప్‌వే ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
పొడవైన రోప్‌వే ఎక్కడంటే?
బల్తాల్ నుండి అమర్‌నాథ్ ఆలయానికి 11.6 కి.మీ పొడవున్న రోప్‌వేను ప్రతిపాదించడం జాబితాలో అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం బాల్తాల్ లేదా పహల్గామ్ నుండి కాలినడకన లేదా హెలికాప్టర్ ద్వారా గుహను చేరుకోవడానికి ఏకైక మార్గం. జాబితాలోని రెండవ పెద్ద ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలోని ప్రధాన ధార్మిక క్షేత్రమైన పతనంతిట్టలోని శబరిమల ఆలయానికి 2.62 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే ఉంది.
Also Read: Chandrababu Cases : చంద్రబాబుకు ‘సుప్రీం’లో భారీ ఊరట.. ఒక్క మాట వినకుండానే ఆ పిటిషన్ కొట్టివేత
జైపూర్‌లోని నహర్‌ఘర్ కోటతో అమెర్ కోటను 6.45 కి.మీ పొడవైన రోప్‌వే ద్వారా అనుసంధానించే ప్రణాళిక ఉంది. ఇది కాకుండా ముస్సోరీ నుండి కెంప్టీ జలపాతం వరకు 3.21 కి.మీ పొడవైన రోప్‌వే కూడా జాబితాలో చేర్చారు. తమిళనాడులోని పర్వతమలై ఆలయం 3.21 కిలోమీటర్ల పొడవుతో మరో ప్రతిపాదిత రోప్‌వే. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని సోనామార్గ్ నుండి థాజివాస్ గ్లేసియర్ వరకు 1.6 కి.మీ పొడవైన రోప్‌వే కూడా ఉంది. దీనిని పర్యాటకులు ఎక్కువగా ఉండే కాలంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని శివనేరి కోట, చిక్కమగళూరులోని ముల్లయన గిరి కూడా 1.41 కి.మీ, 2.38 కి.మీ పొడవుతో రోప్‌వేల జాబితాలో ఉన్నాయి.
ఇతర ప్రధాన ఆలయాలు ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్‌లోని చాముండా దేవి ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కుంజపురి ఆలయం (రిషికేశ్ నుండి), జ్వాలా నరసింహ స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ బోకొండ గంగమ్మ ఆలయం, మధ్యప్రదేశ్‌లోని సల్కాన్‌పూర్ వాలి మాత ఆలయం, అస్సాంలోని భుబన్ పాహ్ మహాదేవ్ ఆలయం కోసం కూడా రోప్‌వేలు ప్రతిపాదించబడ్డాయి.