Chandrababu Cases : చంద్రబాబుకు ‘సుప్రీం’లో భారీ ఊరట.. ఒక్క మాట వినకుండానే ఆ పిటిషన్ కొట్టివేత
ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని బాలయ్య తరఫు న్యాయవాదికి జస్టిస్ బేలా త్రివేది(Chandrababu Cases) వార్నింగ్ ఇచ్చారు.
- By Pasha Published Date - 12:37 PM, Tue - 28 January 25

Chandrababu Cases : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైఎస్సార్ సీపీ హయాంలో ఆయనపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన ఏడు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. చంద్రబాబుపై ఉన్న ఆయా కేసులను సీబీఐకి బదిలీ చేస్తే సమగ్రంగా విచారణ జరుగుతుందని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య ఈ పిటిషన్ వేశారు. ఇది తప్పుడు పిటిషన్ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది సారథ్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read :Tigers Urine For Sale : పులి మూత్రం ఫర్ సేల్.. 250 గ్రాములు రూ.600 మాత్రమే
ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని బాలయ్య తరఫు న్యాయవాదికి జస్టిస్ బేలా త్రివేది(Chandrababu Cases) వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సుప్రీంకోర్టు బెంచ్ ఎదుటకు వచ్చారు. ఆయనకు సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ఇలాంటి పిటిషన్లను కూడా మీలాంటి సీనియర్లు వాదిస్తారా? ఈవిధమైన కేసులను వాదిస్తారని మేం అస్సలు ఊహించలేదు’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా న్యాయవాది వైపు నుంచి వినకుండానే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.