Road Accident : వరంగల్‌లో రోడ్డు ప్రమాదం.. సైకిల్‌ను ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్
వరంగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక వెంకటరమణ థియేటర్ జంక్ష..
- By Prasad Published Date - 10:16 AM, Tue - 11 October 22

వరంగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక వెంకటరమణ థియేటర్ జంక్షన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున స్పోర్ట్స్ బైక్ సైక్లిస్టును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని గాంధీనగర్‌లోని లేబర్ కాలనీకి చెందిన రామస్వామి (51), పోచమ్మ మైదాన్‌కు చెందిన తుమ్మ జయసింహారెడ్డి (18) మృతి చెందారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.