Three Died: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నల్గొండ జిల్లాలో జాతీయ రహదారి 65పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు (Three Died) కోల్పోయారు. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది.
- By Gopichand Published Date - 09:35 AM, Sun - 8 January 23

నల్గొండ జిల్లాలో జాతీయ రహదారి 65పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు (Three Died) కోల్పోయారు. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిని ఇద్దాక్, సమీర్, యాసిన్ గా గుర్తించారు. హైదరాబాద్ లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: 1 Dead, 3 Injured: కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు