Road Accident : కాకినాడలో ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగిన ఘటనలో
- By Prasad Published Date - 09:03 AM, Fri - 2 December 22

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటి మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. క్యాబిన్‌లో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం కాగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.