Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
- By Prasad Published Date - 02:19 PM, Tue - 7 June 22

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లి మండలం గుట్టపల్లి సమీపంలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. మృతులు చిత్తూరు పట్టణంలోని రామ్ నగర్, సంతపేటకు చెందిన లవ కుమార్, శోభలుగా గుర్తించారు. మంత్రాలయం, శ్రీశైలం పుణ్యక్షేత్రాల నుంచి రెండు కార్లలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి ఇతర వాహనాలకు ఇబ్బంది ఏర్పడింది.