Twitter Blue Tick: బ్లూ టిక్ సబ్ స్క్రైబర్లకు ఆదాయం.. ట్విట్టర్ నిర్ణయం.
తన బ్లూ టిక్ (Blue Tick) చందాదారులకు (సబ్ స్క్రైబర్లు) సంతోషకర విషయం ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న
- By Maheswara Rao Nadella Published Date - 12:33 PM, Sat - 4 February 23

తన బ్లూ టిక్ (Blue Tick) చందాదారులకు (సబ్ స్క్రైబర్లు) సంతోషకర విషయం ట్విట్టర్ బ్లూ టిక్ (Twitter Blue Tick) సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారి పేజీల నుంచి వచ్చే ప్రకకటనల ఆదాయంలో వారికి కూడా కొంత పంచనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ క్రియేటర్లకు ఆదాయాన్ని పెంచడం కోసం మస్క్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
‘‘నేటి నుంచి ట్విట్టర్ ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయన్ని క్రియేటర్లకు, వారి రిప్లయ్ థ్రెడ్స్ లో ప్రదర్శితమయ్యే ప్రకటనల రూపంలో పంచనున్నాం. దీనికి అర్హత పొందాలంటే సంబంధిత ట్విట్టర్ యూజర్ తప్పనిసరిగా బ్లూ టిక్ (Twitter Blue Tick) వెరిఫైడ్ అయి ఉండాలి’’అని మస్క్ ట్వీట్ చేశారు. ఈ పెయిడ్ చందాదారులకు 60 నిమిషాల దీర్ఘ నిడివి వీడియోలు అప్ లోడ్ చేసుకోవడంతోపాటు. అధిక రిజల్యూషన్ పొటోలు, 2జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ ను అప్ లోడ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.
ట్వట్టర్ తాజా నిర్ణయం సానుకూల చర్యగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం కేవలం ట్విట్టర్ క్రియేటర్లకే కాకుండా ప్లాట్ ఫామ్ కు సైతం లాభిస్తుందని భావిస్తున్నారు. ఆదాయం పంచడం వల్ల మరింత మంది క్రియేటర్లు ట్విట్టర్ ప్లాట్ ఫామ్ కు ఆకర్షితులు అవుతారని చెబుతున్నారు.
Also Read: Kiccha Sudeep: కిచ్చా సుదీప్ తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ భేటీ