Criminal Case Against KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు.. కారణమిదే..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు (Criminal Case Against KTR) నమోదైంది.
- Author : Gopichand
Date : 30-03-2024 - 11:18 IST
Published By : Hashtagu Telugu Desk
Criminal Case Against KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు (Criminal Case Against KTR) నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500కోట్లు వసూలు చేసి, కాంగ్రెస్ పెద్దలకు పంపారు అంటూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బంజారాహిల్స్ పోలీసులకు పంపగా.. వారు ఐపీసీ సెక్షన్ 504, 505(2) కింద కేసు నమోదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయనను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గత మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంట పీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సీఐ సతీశ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా బత్తిని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ దగ్గర, బిల్డర్స్ దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని కేటీఆర్ లేనిపోని అబద్దాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
Also Read: Anupama Parameswaran: అందుకే నేను ఆ పాత్ర చేశాను.. అనుపమ లేటెస్ట్ కామెంట్స్ వైరల్?
2,500 కోట్లు ఢిల్లీకి పంపారు: కేటీఆర్
మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా డబ్బులిస్తేనే బిల్డింగులకు పర్మిషన్లు మంజూరు చేస్తున్నారని, అలా వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నాలుగు రోజుల కిందట సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
We’re now on WhatsApp : Click to Join