Rapido Free Rides: బంపర్ ఆఫర్ ప్రకటించిన రాపిడో.. ఆరోజు ఉచితంగా రైడ్..!
లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈసారి దేశవ్యాప్తంగా 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. తొలి మూడు దశలకు పోలింగ్ పూర్తి కాగా.. నాలుగో దశలో మే 13న దేశంలోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
- By Gopichand Published Date - 08:22 PM, Fri - 10 May 24

Rapido Free Rides: దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే దేశంలోని పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరిగింది. 7 దశల్లో జరిగే ఎన్నికలకు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈసారి దేశవ్యాప్తంగా 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. తొలి మూడు దశలకు పోలింగ్ పూర్తి కాగా.. నాలుగో దశలో మే 13న దేశంలోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా ఓటింగ్ జరగలేదు. మే 25న ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలకు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. మీరు కూడా ఢిల్లీ నివాసి అయి ఉండి ఓటు హక్కు కలిగి ఉంటే మీకొక శుభవార్త ఉంది. ఆన్‌లైన్ బైక్ సర్వీస్‌ను అందిస్తున్న రాపిడో (Rapido Free Rides) సంస్థ మే 25న ఓటు వేయడానికి వెళ్లే వారికి ఉచిత సేవలను అందించనుంది.
ఎలా బుక్ చేసుకోవాలి?
ఈ ఆఫర్‌ను పొందేందుకు ఓటర్లు ఓటు వేసిన తర్వాత రాపిడో యాప్ ద్వారా తమ రైడ్‌ను బుక్ చేసుకోవాలి. ఈ విషయమై ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ప్రజలు సులభంగా పోలింగ్‌కు చేరుకోవడానికి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటింగ్ పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడం దీని లక్ష్యం.
Also Read: Kannappa : కన్నప్ప నాలుగు రోజుల షూటింగ్‌కి అక్షయ్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? ఈ లెక్కలో ప్రభాస్..!
మే 25న ఓటింగ్ జరగనుంది
ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలు ప్రస్తుతం అధికార భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నాయి. అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ మరోసారి ధీమా వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇక్కడ పొత్తు కింద కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల రంగంలో ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది.
రాపిడో ఇప్పటికే ఈ చొరవ తీసుకుంది
రాపిడో ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ‘రైడింగ్ రెస్పాన్సిబిలిటీ’ చొరవ కింద రాపిడో కర్ణాటకలో ఓటింగ్ రోజున వికలాంగులు, సీనియర్ ఓటర్లకు ఉచిత బైక్ టాక్సీలు, ఆటోలు, క్యాబ్‌లను అందించింది.
We’re now on WhatsApp : Click to Join