RGV: వైసీపీ నేతల పై.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..!
- By HashtagU Desk Published Date - 02:10 PM, Wed - 2 February 22

మిస్టర్ వివాదం జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం వివాదాలతో దోస్తీ చేస్తూనే ఉంటాడు. ట్విట్టర్ సాక్షిగా టాపిక్ ఏదైనా సరై ఆర్జీవీ ట్వీట్ చేశాడంటే అది నిముషాల్లో వైరల్ అవ్వాల్సిందే. ఇక ఇటీవల సినిమా టికెట్ల విషయంలో, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.
ఆ పార్టీ నేతల్ని ఓ రేంజ్‌లో ఆడుకుంటూ వరుస ట్వీట్లు చేస్తూ ఏపీ రాజకీయాల్లోనూ, తెలుగు సినీ వర్గాల్లో రచ్చ లేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అప్పట్లో వైసీపీ మంత్రి ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని పై తనదైన స్టైల్‌లో సెటైర్స్ వేసిన ఆర్జీవీ తాజాగా మరోసారి వైసీపీ నేతల్ని కెలకడం ఇప్పుడు, తెలుగు సినీ, రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. వైసీపీ మంత్రి కొడాలి నాని, ఆపార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబులను తీసేస్తే ఏపీలో వైసీపీ పార్టీ అస్సలు కనిపించదని ఆర్జీవీ మరోసారి వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైసీపీలో ఆ ఇద్దరు నేతలు కీలకమని, ఆపార్టీకి మూల స్థంబాల్లాంటోళ్ళని, ప్రత్యర్ధుల పై నిత్యం ఎటాకింగ్ చేయడంలో ముందుంటారని దీంతో అలాంటి నేతల కారణంగా పార్టీ బలంగా ఉంటుందని, దాడి ఆర్జీవీ వ్యాఖ్యలు చేశారు. ఓటమి అంచుల్లో ఉన్నా, దాడి చేసే సత్తా ఉండాని ఆర్జీవీ పేర్కొన్నారు.
Related News

TDP : లోకేశ్ ను అడ్డుకుంటే జగన్ రెడ్డికి ప్రజలు ఘోరీ కడతారు : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
జగన్ మోహన్ రెడ్డికి నిజంగా ప్రజలమద్ధతు ఉంటే పోలీసులు, ప్రైవేట్ సైన్యం లేకుండా ఇప్పుడు పాదయాత్ర చేయగలడా? అని