Telangana: మళ్ళీ మునుగోడు నుంచే పోటీ చేస్తా
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు .చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడిన రాజ్‌గోపాల్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు 87 వేలకు పైగా ఓట్లు వచ్చాయని ,
- Author : Vamsi Chowdary Korata
Date : 15-10-2023 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు .చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడిన రాజ్‌గోపాల్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు 87 వేలకు పైగా ఓట్లు వచ్చాయని , దీన్ని దృష్టిలో ఉంచుకునే తాను వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తానని కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని , ఆ వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.
Also Read: Nayanthara : జవాన్ కంటే ముందే.. షారుక్‌కి జోడిగా నయనతార కనిపించాలి.. కానీ..!