HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rain Forecast For 5 Districts Of Ap And 7 Districts Of Telangana

Rain Alert : ఏపీలోని 5 జిల్లాలకు.. తెలంగాణలోని 7 జిల్లాలకు వర్షసూచన

Rain Alert : వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

  • Author : Pasha Date : 16-09-2023 - 6:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rain Alert Today

Rain Alert : వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.అంతకుముందు నాలుగైదు రోజులతో పోలిస్తే ఏపీలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని తెలిపింది. రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల మినహా పెద్దగా వానలు పడలేదని స్పష్టం చేసింది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 5 గంటల సమయానికి) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 50.6 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలో 14.8, అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో 11.6, బాపట్ల జిల్లా రేపల్లెలలో 11.4, అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో 10.2, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 10, పల్నాడు జిల్లా అచ్చెంపేటలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపూర్‌లో 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది.

Also read : Breakfast Scheme : దసరా నుంచి ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్స్ కు అల్పాహారం.. కేసీఆర్ ప్రకటన

ఇక తెలంగాణలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇవాళ తెలంగాణలోకి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో సెప్టెంబర్‌ నెలలో సాధారణ వర్షపాతానికి మించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.3 మి.మీ. ఉండగా.. ఈనెల 16వరకు రాష్ట్రవ్యాప్తంగా 150.5 మి.మీ. వర్షం (Rain Alert) కురిసింది. ఇది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 95 శాతం అధికమని హైదరాబాద్‌ వాతావరణ  కేంద్రం వివరించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP districts
  • IMD
  • rain alert
  • Rain Alert Today
  • Rain forecast
  • telangana

Related News

Alert for the people of AP: Heavy rain warning for these districts.

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు

  • Rain's impact... roads turned into rivers.

    Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

  • Cm Vijay: కరూర్ బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

  • Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

  • Indus Waters Treaty: నీటి కటకటతో ఉలిక్కి పడుతున్న పాకిస్థాన్‌!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd