Rahul Gandhi : రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు..
ఈ రోజు పార్టీ పార్లమెంట్‌లో ముఖ్యమైన బిల్లుల చర్చ ఉందని తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొనడం కోసమే లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉందన్నారు.
- By Latha Suma Published Date - 04:12 PM, Tue - 11 February 25

Rahul Gandhi : కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ఈ రోజు పార్టీ పార్లమెంట్‌లో ముఖ్యమైన బిల్లుల చర్చ ఉందని తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొనడం కోసమే లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ హైదరాబాద్, వరంగల్ పర్యటన రద్దు అయినట్లు పేర్కొంది.
Read Also: AAP MLA : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం..
మరోవైపు ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌గాంధీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు హనుమకొండలో పర్యటించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు ఆయన చేరుకుంటారని తొలుత పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అవుతారని వార్తలు వచ్చాయి.
బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది.
Read Also: WhatsApp Video Calls : ఇక ఆ యాప్ నుంచి కూడా వాట్సాప్ వీడియో కాల్స్