Telangana: రేపు ప్రవళిక ఇంటికి రాహుల్
తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ యువతి ప్రవళిక ఇంటికి వెళ్లనున్నారు. రేపు తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్
- Author : Praveen Aluthuru
Date : 17-10-2023 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ యువతి ప్రవళిక ఇంటికి వెళ్లనున్నారు. రేపు తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ప్రవళిక సొంతూరు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి వెళ్తారు. ప్రవళిక కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ మాట్లాడి, పరామర్శించనున్నారు. రేపు తెలంగాణకు చేరుకొని ముందుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అందులో భాగంగానే ప్రవళిక ఇంటికి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమని ప్రచారం జరుగుతుంది. ప్రవళికను శివరామ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించడం వల్లే తన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి ఆరోపిస్తుంది. కూతురు చావుకు కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.వాన్ని ఉరి తియ్యండని ఆమె రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు..
Also Read: KCR Atlas Cycle Story : సిద్దిపేట సభలో కేసీఆర్ చెప్పిన సైకిల్ కథ .. మాములుగా లేదుగా