Ayodhya Ram Mandir Pran Pratishta : మారిషస్ లో రామదండు లా కదిలిన భక్తులు
- By Sudheer Published Date - 03:48 PM, Mon - 22 January 24

అయోధ్య రామ మందిర ప్రారంభం (Ayodhya Ram Mandir Pran Pratishta) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు నేడు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు జై శ్రీ రామ్ (Jai Sriram) అంటూ రామ స్మరణలో మునిగిపోయారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం మన దేశంలోనే కాదు అమెరికా తో పాటు ప్రపంచ దేశాలలో ఉన్న హిందువులంతా రామ జపం చేస్తూ రోడ్లపైకి రామదండులా కదిలి వచ్చి తమ భక్తిని చాటుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మారిషస్ (Mauritius)లో ఉంటున్న భారతీయులు సంతోషంతో వందలాది కార్లతో భారీగా రథయాత్ర నిర్వహించారు. ఆంజనేయుడి జెండాలను ప్రదర్శిస్తూ, జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇండియాలోని ఏదైనా సిటీ అనుకొని పొరబడేరు.. కాదు, ఇది మారిషస్ అంటూ ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు రామ భక్తులు. దీన్ని చూసిన నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. విదేశాల్లో ఉంటున్నా దైవభక్తిని, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకపోవడం గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక, రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న దేశ ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మన రాముడు మళ్లీ వచ్చాడని, ఎన్నో బలిదానాలు, త్యాగాల అనంతరం ఆయన తన గుడిలోకి వచ్చాడని, ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు అని తెలియజేసారు. ఇక నుంచి బాల రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. రామ్ లల్లా గుడిలో ఉంటాడు. 2024 జనవరి 22 అనేది సాధారణ తేదీ కాదు.. ఇది కొత్త కాలచక్రానికి ప్రతీక’ అని మోడీ చెప్పుకొచ్చారు.
This is not any Indian city but Mauritius.#ShriRamYatra 🔥 pic.twitter.com/PEPsuktnVg
— Mr Sinha (@MrSinha_) January 22, 2024
Read Also : Advani: అయోధ్యకు రాని అద్వానీ, అసలు కారణమిదే