Munugode By-Poll : మునుగోడులో కొనసాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు....
- Author : Prasad
Date : 03-11-2022 - 8:46 IST
Published By : Hashtagu Telugu Desk
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.