Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసలో పోలీసు మృతి, 200 మంది గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన ర్యాలీల నేపథ్యంలో శనివారం హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఒక పోలీసు మృతి చెందగా, భద్రతా సిబ్బంది సహా 200 మందికి పైగా గాయపడ్డారు.
- By Praveen Aluthuru Published Date - 11:25 PM, Sat - 28 October 23

Bangladesh Violence: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన ర్యాలీల నేపథ్యంలో శనివారం హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఒక పోలీసు మృతి చెందగా, భద్రతా సిబ్బంది సహా 200 మందికి పైగా గాయపడ్డారు. హింసను నియంత్రించేందుకు పారామిలటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)ని మోహరించారు. వచ్చే జనవరిలో ప్రతిపాదించిన సార్వత్రిక ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత చెలరేగింది.
ఢాకాలో మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించింది.దీనితో పాటు ప్రధాని షేక్ హసీనా అధికార అవామీ లీగ్ పార్టీ కూడా మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులతో శాంతి ర్యాలీని నిర్వహించింది. అయితే ప్రత్యర్థి పార్టీ సభ్యులు ప్రయాణిస్తున్న బస్సుపై BNP కార్యకర్తలు దాడి చేయడంతో వివాదం చెలరేగింది.
గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి BNP కార్యకర్తలను చెదరగొట్టారు.ఈ క్రమంలో రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.ఘర్షణల్లో ఒక పోలీసు BNP కార్యకర్తలచే చంపబడ్డాడు. 41 మంది పోలీసులు గాయపడ్డాడు. 39 మంది పోలీసులు రాజర్‌బాగ్ సెంట్రల్ పోలీస్ హాస్పిటల్ (సిపిహెచ్)లో చికిత్స పొందుతున్నారు. ఆందోళనకారులు అంబులెన్స్‌లు, వాహనాలు, పోలీస్ బూత్‌కు నిప్పుపెట్టి పలు ప్రభుత్వ భవనాలపై దాడికి ప్రయత్నించారు.
Also Read: TDP : చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై 46వ రోజూ కొనసాగిన నిరసనలు