HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leaders Statewide Protest

TDP : చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై 46వ రోజూ కొనసాగిన నిరసనలు

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 46వ రోజూ కొనసాగాయి. నందిగామ

  • Author : Prasad Date : 28-10-2023 - 10:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 46వ రోజూ కొనసాగాయి. నందిగామ నియోజకవర్గం చందర్లపాడులో నల్ల కండువాలతో పార్టీ శ్రేణుల నిరసన తెలిపారు. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గొల్లపూడి పార్టీ కార్యాలయం నుండి వన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద వరకు కాగడా ర్యాలీ చేపట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వ‌హించారు. గుంటూరు లాడ్జి సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు టీడీపీ శ్రేణులు ‘భువనమ్మకు అండగా చంద్రన్నకు తోడుగా’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్య‌క్ర‌మానికి అనుమతి లేదని పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భీమిలిలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టగా నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నుండి బయట పడాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఏడవ రోజు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join.

గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో గుంటూరు బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బ్లడ్ ఫర్ బాబు పేరుతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలో హనుమంతురాయ చౌదరి ఆధ్వర్యంలో శివాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మర్రిమాకులపల్లి నుండి ములకనూరు కొండ పైకి తిమ్మప్పస్వామి దేవాలయం వరకు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు నాయకుడు గారిని ఆధారాల్లేని అక్రమ అరెస్టు చేసి 50 రోజులైన సందర్భంగా సాలూరు నియోజకవర్గంలో గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో “మోకాళ్లపై నిరసన” తెలిపారు. మంగళగిరి రూరల్ మండలం, కృష్ణాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు అవల రవికిరణ్, గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. లైబ్రరీ సెంటర్ నుంచి శివాలయం వరకు పెద్ద ఎత్తున కాగడాల ర్యాలీ చేపట్టారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు సైతం ర్యాలీలో పాల్గొన్నారు.

Also Read:  TDP : ప్రభుత్వానిది ధనబలం.. మాది ప్రజాబలం.. శ్రీకాళహస్తిలో ‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • nara chadnrababu naidu
  • tdp

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd