Minior Girls : నరసరావుపేట అదృశ్యమైన మైనర్ బాలిక క్షేమం
నరసరావుపేట లో అదృశ్యమైన మైనర్ బాలిక క్షేమంగా తిరిగి వచ్చింది. బుధవారం అదృశ్యమైన మైనర్ బాలికపై నర్సరావుపేట
- Author : Prasad
Date : 19-08-2023 - 8:32 IST
Published By : Hashtagu Telugu Desk
నరసరావుపేటలో అదృశ్యమైన మైనర్ బాలిక క్షేమంగా తిరిగి వచ్చింది. బుధవారం అదృశ్యమైన మైనర్ బాలికపై నర్సరావుపేట పోలీసులు ఆచూకీ కోసం వెతికారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన 17 ఏళ్ల బాలిక అనారోగ్యం సాకుతో తరచూ కాలేజీకి వెళ్లకుండా ఉండటంతో ఆమె తల్లి బాలికను హెచ్చరించింది. కాలేజీకి బలవంతంగా పంపించింది. కుమార్తె కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఆమె కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బాలికను గుర్తించిన పోలీసులు నరసరావుపేటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక క్షేమంగా ఇంటికి తిరిగిరావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చకున్నారు.