Uttar Pradesh : యూపీలో దారుణం.. కానిస్టేబుల్‌ని కొట్టి చంపిన బంధువులు
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో దారుణం చోటుచేసుకుంది. బంధువులతో జరిగిన గొడవలో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి
- Author : Prasad
Date : 03-01-2023 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో దారుణం చోటుచేసుకుంది. బంధువులతో జరిగిన గొడవలో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడు విశ్వజిత్ షా (30)గా గుర్తించామని, జాన్‌పూర్ పోలీస్ లైన్స్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వజిత్ షా సెలవుపై మహల్ మజారియా ప్రాంతంలోని తన ఇంటికి వచ్చాడని తెలిపారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం సాయంత్రం బాధితుడికి, ఇరుగుపొరుగు వారి బంధువులకు మధ్య గొడవ జరిగిందని ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. నిందితులు ఇంట్లోకి చొరబడి కానిస్టేబుల్‌ని కొట్టడంతో స్పృహతప్పి పడిపోయాడని.. అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్పీ తెలిపారు. బాధితుడిపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు.