Rahul Gnadhi: మోడీ తెలంగాణ ద్రోహి: రాహుల్ గాంధీ
పార్లమెంటులో ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని అగౌరవ పరిచేవిధంగా వ్యవహరించారని అన్నారు.
- Author : Praveen Aluthuru
Date : 19-09-2023 - 6:32 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gnadhi: పార్లమెంటులో ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని అగౌరవ పరిచేవిధంగా వ్యవహరించారని అన్నారు. తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని మోడీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించడం ద్వారా రెండు రాష్ట్రాలు అధోగతి పాలయ్యాయని మోదీ వ్యాఖ్యానించారు. ఇక మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. మోడీ వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్ తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకంటూ ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా అని నిలదీశారు. తల్లిని చంపి బిడ్డను తీసారని, అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లుమా అస్తిత్వాన్ని అవమానిస్తారు, పద్నాలుగేండ్లు పోరాడి..దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకు అంటూ ఫైర్ అయ్యారు.