Rozgar Mela: 51 వేల అపాయింట్‌మెంట్లను పంపిణీ చేయనున్న మోదీ
ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి కోరిక రోజ్‌గార్ మేళా (Rozgar Mela) ద్వారా సాకారం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరగనుంది.
- Author : Praveen Aluthuru
Date : 28-08-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
Rozgar Mela: ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి కోరిక రోజ్‌గార్ మేళా (Rozgar Mela) ద్వారా సాకారం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా (Rozgar Mela) జరగనుంది. ఈ ఈవెంట్ ద్వారా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మరియు సశాస్త్ర సీమా బల్ (SSB)తో సహా వివిధ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు)లో సిబ్బందిని రిక్రూట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన వారు వివిధ సంస్థల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), సబ్-ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ) మరియు నాన్-జనరల్ డ్యూటీ కేడర్ వంటి వివిధ ఉద్యోగాలలో చేరనున్నారు.
ప్రభుత్వ శాఖల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: kidney stones: ఈ ఐదు పదార్థాలు తింటే చాలు కిడ్నీలో రాళ్లు మాయం?